Hyderabad: హైదరాబాద్ కేబీఆర్ పార్కులో అరుదైన జీవి ప్రత్యక్షం

  • కేబీఆర్ పార్కులో అలుగు
  • చీమలు, చెదపురుగులే దీని ఆహారం
  • ఉదయం వాకర్లకు కనిపించిన జంతువు

హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మధ్య కేబీఆర్ పార్కు విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్కులో నెమళ్లు, అనేక చిన్న జంతువులు సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఓ అరుదైన జీవి కేబీఆర్ పార్కులో కనిపించింది. దీనిపేరు అలుగు. ఇంగ్లీషులో పంగోలిన్ అంటారు. మొసలి చర్మంలా మందంగా బలమైన పొలుసులతో కూడి ఉంటుంది. దీని ఆహారం చీమలు, చెదపురుగులు. ఇటీవల ఉదయం వాకింగ్ చేస్తున్న కొందరికి ఈ అలుగు కనిపించింది. దీన్ని వారు వీడియోలో చిత్రీకరించారు. ఈ అలుగు తనకు ఆపద ఉందని తెలిస్తే శరీరాన్నంతటినీ ముడుచుకుని ఓ రబ్బరు బంతిలా గుండ్రంగా మారిపోగలదు.

More Telugu News