Jagan: విపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు సాంకేతిక అంశాలు గుర్తుకురాలేదా?: మాణిక్యాలరావు

  • మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత
  • భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
  • అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నట్టు వెల్లడి
బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు రాజధాని అంశంపై స్పందించారు. మూడు రాజధానులపై అఖిలపక్ష కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు సాంకేతిక అంశాలు గుర్తుకురాలేదా? అంటూ ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని అన్నారు. అయితే తాము, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Jagan
Andhra Pradesh
Amaravati
Manikyala Rao
BJP

More Telugu News