Abhinandan Vardhaman: అభినందన్ వర్ధమాన్ రాఫెల్ లో వెళ్లుంటే పరిస్థితి మరోలా ఉండేది: బీఎస్ ధనోవా

  • బాంబే ఐఐటీలో ప్రసంగించిన ఐఏఎఫ్ మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్
  • రాఫెల్ పై సుప్రీం తీర్పు పట్ల ప్రశంసలు
  • రాఫెల్ ఒప్పందానికి పదేళ్లు పట్టిందని వెల్లడి

భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతర పరిణామాల్లో భాగంగా నాడు అభినందన్ వర్ధమాన్ రాఫెల్ యుద్ధవిమానంలో వెళ్లుంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. రాఫెల్ యుద్ధవిమానానికి ఉన్న అదనపు సామర్థ్యంతో అభినందన్ పూర్తి సురక్షితంగా తిరిగివచ్చేవాడన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆ సమయంలో అభినందన్ ఎందుకు రాఫెల్ లో వెళ్లలేదంటే అందుక్కారణం ఆ విమానాల కొనుగోలులో జరిగిన జాప్యమే. ఏ తరహా విమానం కొనాలో నిర్ణయం తీసుకోవడానికే పదేళ్లు పట్టింది. ఆ ఆలస్యమే అనేక పోరాటాల్లో భారత్ పై ప్రభావం చూపించింది" అని వివరించారు. భారత్ లో చొరబడిన పాక్ విమానాలను తరిమికొట్టేందుకు అభినందన్ మిగ్-21 విమానంతో వెళ్లి శత్రువులకు దొరకడం తెలిసిందే. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు,

More Telugu News