Maharashtra: మహారాష్ట్రను పర్యాటక స్వర్గధామం చేస్తా : మంత్రి ఆదిత్య ఠాక్రే

  • ఆదాయం పెంపునకు అన్ని విధాలా ప్రయత్నం 
  • థాకరే కుటుంబం నుంచి తొలి ప్రజాప్రతినిధి ఆదిత్య 
  • ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు

మహారాష్ట్రను పర్యాటక స్వర్గధామంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఠాక్రేల కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన ఆదిత్య తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, సందర్శకుల సౌకర్యాలపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు.

Maharashtra
aditya thakery
touriosm

More Telugu News