Libia: లిబియాలో సైనికులపై రాకెట్ దాడి... 28 మంది మృతి!

  • స్కూల్ లో సమావేశమైన సైనికులు
  • తిరిగి గుడారాలకు వెళుతుండగా దాడి
  • రక్తదాతలు కావాలని కోరిన ప్రభుత్వం
లిబియా రాజధాని ట్రిపోలీలోని ఓ సైనిక పాఠశాలపై కొందరు ముష్కరులు వైమానిక దాడులకు తెగబడగా, 28 మంది సైనికులు మరణించారు. మరో 12 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని లిబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమీన్ అల్ హమేషీ వెల్లడించారు. సైనికులంతా పరేడ్ గ్రౌండ్ లో సమావేశమైన వేళ, ఈ ఘటన జరిగింది. వీరంతా తమ గుడారాల్లోకి వెళుతుండగా, విమానాల నుంచి రాకెట్లను జార విడిచినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం అవసరమని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం కోరింది.
Libia
Militents
Rocket Attack
Soldiers

More Telugu News