Maharashtra: అజిత్ పవార్ కు ఆర్థిక శాఖ... మంత్రులకు శాఖలను పంచిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే!

  • కుమారుడు ఆదిత్యకు రెవెన్యూ శాఖ
  • అనిల్ దేశ్ ముఖ్ కు హోమ్ శాఖ
  • పలు కీలక శాఖలు ఉద్ధవ్ వద్దే
అందరూ అనుకున్నట్టుగానే డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. ఇటీవల మంత్రివర్గాన్ని ఎంచుకున్న ఆయన, తాజాగా వారికి శాఖలను కేటాయించారు. తన కుమారుడు ఆదిత్య థాకరేకు రెవెన్యూ శాఖను, అనిల్ దేశ్ ముఖ్ కు మరో కీలక శాఖ అయిన హోమ్ శాఖను అప్పగించారు. సుభాష్ దేశాయ్ కి పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ శాఖలు, నవాబ్ మాలిక్ కు మైనారిటీ అభివృద్ధి శాఖను, చగన్ భుజ్ బల్ కు ఆహార, పౌర, వినియోగదారుల రక్షణ శాఖను అప్పగించారు. సాధారణ పరిపాలన, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్, న్యాయ శాఖలతో పాటు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలను ఉద్ధవ్ తనవద్దే ఉంచుకున్నారు. భవిష్యత్తులో తీసుకునే కొత్త మంత్రులకు వీటిని కేటాయించవచ్చని తెలుస్తోంది.
Maharashtra
Uddhav Thakare
Ajit Pawar
Aditya

More Telugu News