Pawan Kalyan: పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో కూడా వుంటే తప్పేంటి?: రాపాక
- రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు
- పవన్ నిర్ణయంతో తనకు సంబంధంలేదని వెల్లడి
- పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమంటూ వ్యాఖ్యలు
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్న ఆయన మరింత కీలక వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. తన నిర్ణయాలు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాపాక వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశారు.
పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చిరంజీవి సైతం మూడు రాజధానులను సమర్థించారని, పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించడంలేదని తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయమని అడుగుతున్నారని వివరించారు. పార్టీ అధినేతగా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది పవనే అని, కానీ తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమని అన్నారు.