banjara hills: మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి.. కేబీ ఆర్ పార్క్ సమీపంలో ఘటన

  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా ఘటన
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వైనం
  • ఈ తెల్లవారుజామున ఘటన
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన ఇంరోజ్ బాషా ఈ తెల్లవారుజామున స్నేహితుడితో కలిసి బైక్‌పై కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తున్నాడు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇంరోజ్ వాహనాన్ని అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇంరోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
banjara hills
kbr park
Road Accident

More Telugu News