Boaston Group consultancy: ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలపై బీసీజీ నివేదికలో వివరణ?

  • అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులు
  • వ్యవసాయం, పారిశ్రామిక..తదితర రంగాల్లో ప్రణాళికలు
  • దేశంలోని వివిధ రాష్ట్రాల బహుళ రాజధానులపై వివరణ

ఏపీ సీఎం జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, అమరావతి ప్రాంత వ్యూహాలను ఈ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులపై వివరణతో పాటు ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, మత్స్య రంగాల్లో ప్రణాళికల గురించి వివరించినట్టు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ మెగాసిటీలు, అవి అనుకున్న లక్ష్యాలను సాధించాయా? లేవా? అన్న విషయాన్ని గణాంకాలతో సహా బీసీజీ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ప్రపంచంలోని వివిధ దేశాల, దేశంలోని వివిధ రాష్ట్రాల బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాలను తన నివేదికలో బీసీజీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

More Telugu News