kanchana: కాంచనను అనుకుంటే హీరోయిన్ గా శారద సెట్ అయిందట

  • హిట్ చిత్రంగా నిలిచిన'కాలం మారింది'
  • అలా కె. విశ్వనాథ్ చేతికి వచ్చిన ప్రాజెక్టు
  • శారదకు మంచి పేరు తెచ్చిన సినిమా
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "దర్శకుడిగా వి.మధుసూదనరావు గారికి మంచి పేరు వుంది. ఆయన సినిమాల్లో కథానాయికగా ఎక్కువ కాంచనగారు కనిపించేది. 'కాలం మారింది' సినిమాకి దర్శకుడిగా మొదట వి.మధుసూదనరావును అనుకున్నారు.

కథాకథనాలతో పాటు మిగతా విషయాలు మాట్లాడటం జరుగుతుండగా, ఈ కథకి హీరోయిన్ గా 'కాంచన' అయితే బాగుంటుందని ఆయన అన్నారట. అయితే నిర్మాతలు మాత్రం హీరోయిన్ గా శారదగారు అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించారు. ఈ విషయంలో రాజీపడే ఉద్దేశం లేకపోవడంతో, దర్శకుడిగా వి.మధుసూదన్ రావును మార్చేసి, మరో దర్శకుడిని తీసుకున్నారు .. ఆయన ఎవరో కాదు .. కె.విశ్వనాథ్ గారు. అలా శారద గారు చేసిన ఆ సినిమా విజయవంతమై ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.
kanchana
Sarada

More Telugu News