రేపు అమరావతి బంద్ కు పిలుపు నిచ్చిన రాజధాని రైతులు
- మందడంలో మహిళలపై పోలీస్ దౌర్జన్యానికి నిరసన
- శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈడ్చుకెళతారా?
- పోలీసులపై మండిపడుతున్న రైతులు
మహిళలపై పోలీసుల ప్రతాపం దారుణం: నారా లోకేశ్
ఈ ఘటనను టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు తమ ప్రతాపం చూపడం దారుణమని అన్నారు. సీఎం జగన్ ని ‘మాట తప్పకండి, మడమ తిప్పకండి’ అని అడగడం తప్పా? అని ప్రశ్నించారు.