cm: సీఎం జగన్ కు బోస్టన్ కమిటీ నివేదికను అందజేసిన ప్రతినిధులు

  • తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసిన బృందం
  • నివేదికలోని వివరాలపై జగన్ కు  వివరణ  
  • ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసిన బోస్టన్ కమిటీ  
ఏపీ అభివృద్ధి, రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను సీఎం జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో రాజధాని అంశం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఇందులోని వివరాలను జగన్ కు బీసీజీ ప్రతినిధులు వివరించారు. కాగా, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై ఈ నెల 6న హైపవర్ కమిటీ  సమావేశం కానుంది. ఈ నెల 20 లోగా హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
cm
Jagan
Bostan committee
Report
Tadepalli

More Telugu News