rammadhav: అవగాహన లేకుండా సీఏఏను తప్పుపట్టడం సరికాదు: బీజేపీ నేత రాంమాధవ్

  • పౌరసత్వ సవరణ చట్టంలోని వాస్తవాలను అర్థం చేసుకోవాలి
  • భావోద్వేగాలను రెచ్చగొట్టడం బాధనిపిస్తోంది
  • వాస్తవాలను ప్రజల ముందుంచాలి

కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై గుడ్డిగా విమర్శించి భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాకుండా, అందులోని వాస్తవాలను అర్థం చేసుకుని సహేతుకంగా వ్యవహరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విపక్షాలకు సలహా ఇచ్చారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వాళ్లకు తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కారణం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం బాధాకరమన్నారు.

సీఏఏ ఏ మతానికి, కులానికి, రంగుకు వ్యతిరేకం కాదని, ఈ విషయం ప్రతిపక్ష నాయకుల బుర్రలోకి వెళ్లకపోవడం బాధాకరమన్నారు. గతంలో చారిత్రక తప్పిదం జరిగిందని, మత ప్రాతిపదికన దేశ విభజన జరిగిందని అన్నారు.

అందువల్ల ఇది శరణార్థులకు మాత్రమే వర్తించే చట్టమని, ఈ వాస్తవాన్ని విపక్షాలు తెలుసుకుని ప్రజల్ని తప్పుతోవ పట్టించడం మానాలన్నారు. వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం జరగాలని హితవు పలికారు.

More Telugu News