amezon: స్నాప్ డీల్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ డేటా లీక్.. వినియోగదారుల ఆందోళన

  • డేటాను లీక్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా
  • అరెస్టు చేసిన పోలీసులు
  • బీహార్‌ కబీర్‌పూర్‌కు చెందిన ముఠా 
  • బహుమతుల పేరుతో ఆకర్షించి  మోసాలు 

స్నాప్‌డీల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ప్రముఖ సంస్థల నుంచి డేటాను లీక్ చేసి మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌ కబీర్‌పూర్‌కు చెందిన ఈ ముఠా ఈ-కామర్స్‌లో వినియోగదారుల డేటాను తస్కరిస్తోందని సైబరాబాద్ సైబర్ నేరాల నిరోధక శాఖ పోలీసులు గుర్తించారు.

ఆ డేటా ఆధారంగా వినియోగదారులకు గాలం వేసి మోసం చేస్తోందని పోలీసులు తెలిపారు. డేటా సేకరించి వినియోగదారుల ఇష్టాయిష్టాలను గుర్తించి, బహుమతుల పేరుతో వారిని ఆకర్షించి మోసాలకు పాల్పడుతోంది. ఈ-కామర్స్‌లోని డేటా లీక్ కావడం పట్ల స్నాప్‌డీల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ప్రముఖ సంస్థల  వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆ ముఠా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

More Telugu News