ఏపీ విద్యాశాఖ అధికారుల తీరు దారుణంగా ఉంది: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
- గతేడాది మేలో ఇండెంట్ పెడితే ఇప్పుడా ఇచ్చేది
- అధికారులు నిద్రపోతున్నారు
- విద్యార్థులు ఏం చదివి పరీక్షలు రాస్తారు?
గతేడాది మేలో ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడితే జనవరిలో ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందన్నారు. కనీసం వచ్చే ఏడాది అయినా సకాలంలో పుస్తకాలు అందించాలని అధికారులను ఆర్కే కోరారు.