Tollywood: హీరో రాజశేఖర్ కు సర్దిచెప్పేందుకు విఫలయత్నాలు చేసిన జయసుధ!

  • పార్క్ హయత్ హోటల్ లో మా డైరీ ఆవిష్కరణ
  • రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు
  • కంట్రోల్ చేసుకోవాలంటూ రాజశేఖర్ కు జయసుధ హితవు
మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటి జయసుధ కూడా పాల్గొన్నారు. మా అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవితల గురించి సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే, హీరో రాజశేఖర్ మైక్ అందుకుని వీరావేశంతో మాట్లాడడంతో అసహనం చెందిన వారిలో జయసుధ కూడా ఉన్నారు. వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబు వంటి వాళ్లను ఆగ్రహానికి గురిచేసేలా రాజశేఖర్ ప్రసంగం సాగుతుండడం పట్ల జయసుధ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి చేరుకుని రాజశేఖర్ నుంచి మైక్ తీసుకునే ప్రయత్నం చేశారు.

అంతేకాదు, రాజశేఖర్ ను వారించడానికి విఫలయత్నాలు చేశారు. కంట్రోల్.. రాజశేఖర్... కంట్రోల్ అంటూ సభను సామరస్య మార్గంలో మళ్లించేందుకు తనవంతు కృషి చేశారు. కానీ హీరో రాజశేఖర్ మాత్రం ఎవరెంత అభ్యంతరపెట్టినా లెక్కచేయకుండా తన మనసులో ఉన్నది బయటికి వెళ్లగక్కారు. ఆపై కార్యక్రమం నుంచి వాకౌట్ చేశారు.
Tollywood
MAA
Rajasekhar
Jayasudha
Chiranjeevi
Mohanbabu

More Telugu News