Uttar Pradesh: మహిళతో ఏఎస్పీ శృంగార ముచ్చట్లు... ఆన్ లైన్ లో లీక్!

  • యూపీలో పని చేస్తున్న వైభవ్ కుమార్
  • శృంగార చాటింగ్ వీడియోలు వైరల్
  • కేసును రిజిస్టర్ చేసిన నోయిడా పోలీసులు
ఉత్తర ప్రదేశ్ లో ఏఎస్పీ హోదాలో ఉన్న వైభవ్ కుమార్ అనే అధికారి, ఓ మహిళతో శృంగార పరమైన చాటింగ్, ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఓ మహిళ, సదరు ఏఎస్పీతో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, మరో స్మార్ట్ ఫోన్ తో వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోల్లో ఆ మహిళ మాత్రం కనిపించలేదు.

ఈ వీడియోలోని వాయిస్ గౌతమ్ బుద్ధ నగర్ ఏఎస్పీ వైభవ్ కుమార్ దేనని తెలుస్తుండగా, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కొందరు మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గడచిన ఏడాది కాలంలో నేరాలపై, ఎక్స్ టార్షన్ రాకెట్స్ పై తాను కఠినంగా వ్యవహరించానని, అందుకు దక్కిన బహుమతే ఇదని ఆయన అన్నారు. కొన్ని శక్తులు తనపై కుట్ర పన్నాయని, వీడియోలను ఆన్ లైన్ లో పెడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు.

కాగా, ఈ వీడియోల లీకేజీపై నోయిడా పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. పారదర్శకంగా దర్యాఫ్తు జరిపించేందుకు కేసును మీరట్ జిల్లాకు బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Uttar Pradesh
Vaibhav Kumar
ASP
S*x Talkings
Merut
Police

More Telugu News