Crime News: వనపర్తిలో భార్య, కుమార్తెకు నిప్పంటించిన కసాయి

  • చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో ఘటన
  • భార్య, కుమార్తె నిద్రిస్తోన్న సమయంలో ఘటన
  • ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం
  • భర్త, కుమార్తె మృతి
వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఇదే అదునుగా భావించిన ఆమె భర్త వారిద్దరిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో గత రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆ కసాయి.. నిద్రిస్తోన్న తన భార్య, కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు గుర్తించారు.

అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలపాలైన ముగ్గురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ తండ్రి జయన్న, కుమార్తె గాయత్రి (16) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భార్య వరలక్ష్మి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Crime News
Wanaparthy District

More Telugu News