నిర్భయ దోషులకు నలుగురికీ ఒకేసారి ఉరి.. ఏర్పాట్లు షురూ!
- దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసు
- ప్రస్తుతం తీహార్ జైల్లో ఒకే ఉరికంబం
- మరో మూడు కంబాలను, సొరంగాలను నిర్మిస్తున్న అధికారులు
అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.