Shirdi Saibaba: విరాళాల రూపంలో షిర్డీ సాయికి రూ.287 కోట్లు!

  • గతేడాది వివిధ రూపాల్లో భక్తులు సమర్పించిన కానుకల విలువ రూ.287 కోట్లు
  • ధనం రూపంలో రూ.217 కోట్లు 
  • 19 కిలోల బంగారు ఆభరణాలు

షిర్డీ సాయిబాబాకు గతేడాది విరాళాల రూపంలో రూ.287 కోట్లు వచ్చినట్టు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. 1 జనవరి 2019 నుంచి 31 డిసెంబరు వరకు భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలు, మొక్కుల విలువ రూ. 287 కోట్లని ట్రస్ట్ సీఈవో దీపక్ ముగ్లికర్ తెలిపారు. ఈ మొత్తం కానుకల్లో రూ.217 కోట్లు ధనం రూపంలో వచ్చాయని, ఇందులో మూడో వంతు చెక్కులు, డీడీలు, మనియార్డర్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్లు, విదేశీ కరెన్సీ రూపంలో వచ్చినట్టు వివరించారు. బంగారు ఆభరణాలు, నాణేల రూపంలో 19 కిలోలు వచ్చినట్టు తెలిపారు. అలాగే, 391 కిలోల వెండి వస్తువులు కూడా బాబాకు సమర్పించిన కానుకల్లో ఉన్నట్టు సీఈవో దీపక్ తెలిపారు.

More Telugu News