ఆ చిన్నపిల్లోడు ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు: నటి విజయశాంతి

01-01-2020 Wed 19:11
  • డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశాను
  • చాలా బాగా వచ్చింది.. డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేశాను
  • ‘సరిలేరు నీకెవ్వరు’ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశానని, చాలా బాగా వచ్చిందని, ఈ చిత్రంలో తనది ‘డిగ్నిఫైడ్ క్యారెక్టర్’ అని చెప్పారు. ఒక అందమైన సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చేశారని, ఆయనకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు.

ఈ సందర్భంగా 1988లో వచ్చిన కొడుకుదిద్దిన కాపురం చిత్రం గురించి ఆమె ప్రస్తావించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేశ్ బాబు నటించాడని చెబుతూ, అందులో ఓ సన్నివేశం గురించి ఆమె గుర్తుచేసుకున్నారు. మహేశ్ బాబు చెంపపై తాను కొట్టాల్సిన సన్నివేశం షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎంతో క్యూట్ గా ఉన్న మహేశ్ బాబు చెంపపై కొట్టేందుకు తనకు మనసు రాలేదని, దాంతో ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ చిన్న పిల్లోడు ఈరోజు సూపర్ స్టార్ అనీ, మళ్లీ ఆ బిడ్దతో కలిసి యాక్టు చేస్తానని అనుకోలేదని అన్నారు.