Telugudesam: అమరావతి నుంచి రాజధానిని ఒక అంగుళం కూడా కదపలేరు: ఎంపీ కేశినేని నాని

  • రాజధాని ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి నాని పర్యటన
  • అక్కడి ప్రజల నిరసనలకు సంఘీభావం తెలిపాం
  • రాజధానిని తరలించాలని చూస్తే పోరాడతాం
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈరోజు పర్యటించారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతున్న అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపినట్టు నాని ఓ ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన విమర్శలు చేశారు. జగన్ అండ్ ముఠా ఇక్కడి నుంచి రాజధానిని ఒక అంగుళం కూడా కదపలేరని హెచ్చరించారు. అందుకు భిన్నంగా ఏం జరిగినా చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని ప్రజలకు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
Telugudesam
Mp
Kesineni Nani
Amaravathi

More Telugu News