Etala Rajender: నాకు కొట్లాడటమే తెలుసు.. దొంగదెబ్బ తీయడం తెలియదు: ఈటల రాజేందర్
- నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుంది
- ప్రజలు కూడా ధర్మం తప్పితే ఓడిపోయేవాడిని
- నమ్మక ద్రోహం చేసినవారు బాగుపడరు
నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చయినా తాను ఎవరి వద్దా చేయి చాచలేదని చెప్పారు. తనకు కొట్లాడటం మాత్రమే తెలుసని, దొంగదెబ్బ తీయడం చేతకాదని అన్నారు. ప్రజలు ధర్మాన్ని నమ్ముతారు కాబట్టే గత ఎన్నికల్లో తాను గెలుపొందానని... ప్రజలు కూడా ధర్మం తప్పి ఉంటే తాను ఓడిపోయేవాడినని చెప్పారు.
తనకు నమ్మక ద్రోహం చేసినవారు బాగుపడరని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఈటల ఓటమి కోసం టీఆర్ఎస్ లోనే ఓ వర్గం పని చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.