'శ్రీరెడ్డి దొరికిపోయింది' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

01-01-2020 Wed 17:02
  • ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ పరమహంస
  • ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన 
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం 

న్యూ ఇయర్ సందర్భంగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన నటిస్తున్నారు. యశ్వంత్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత డి.వెంకటేశ్, మ్యూజిక్ డైరెక్టర్ గణేశ్ రాఘవేంద్ర, ఫొటోగ్రఫీ మనోహర్ అందిస్తున్నారు.