Andhra Pradesh: ఏపీ గవర్నర్, సీఎంలను కలిసి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి వెల్లంపల్లి

  • గవర్నర్ కు దేవాదాయ శాఖ క్యాలెండర్, దుర్గమ్మ ప్రసాదం అందజేత
  • సీఎం జగన్ కు టీటీడీ వేదపండితుల ఆశీర్వాదం
  • జగన్ ని కలిసిన వారిలో మల్లాది విష్ణు, దుర్గ గుడి ఈవో
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కు దేవాదాయ శాఖ 2020 క్యాలెండర్ ను, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి ప్రసాదాన్ని వెల్లంపల్లి అందజేశారు.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ వేదపండితులతో కలిసి జగన్ ని వెల్లంపల్లి ఈరోజు కలిశారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. జగన్ ని కలిసిన వారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గ గుడి ఈవో తదితరులు ఉన్నారు.
Andhra Pradesh
Minister
Vellampally
cm
jagan

More Telugu News