Ravishankar Prasad: ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.. రాష్ట్ర అసెంబ్లీలకు లేదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

  • సీఏఏను వెనక్కి తీసుకోవాలని కేరళ అసెంబ్లీ తీర్మానం
  • ఇది ఆరెస్సెస్ అజెండాలో భాగమన్న విజయన్
  • న్యాయ సలహా తీసుకోవాలని విజయన్ కు రవిశంకర్ ప్రసాద్ సూచన

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసే ఎలాంటి అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే దీనిపై చట్టాలు చేసే అధికారం ఉందని అన్నారు. ఈ విషయంపై న్యాయ సలహాను తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సూచించారు.

సీఏఏకు సంబంధించి కేరళ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు సభలో విజయన్ మాట్లాడుతూ... ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ చట్టం ఆరెస్సెస్ అజెండాలో భాగమని అన్నారు. ముస్లింలను అంతర్గత శత్రువులుగా ఆరెస్సెస్ భావిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నియంత్రిస్తోందని తెలిపారు.

More Telugu News