Sachin Tendulkar: వారిపై ప్రేమను కురిపిద్దాం: సచిన్ 

  • వారి కలలను నెరవేర్చుకునేలా వారిని తీర్చిదిద్దుదాం
  • పిల్లల ఆరోగ్యం, విద్య, పౌష్ఠికాహారంపై ఖర్చు చేయాలి
  • ఈ దశాబ్దాన్ని పిల్లలకు కేటాయిద్దాం
ఈ దశాబ్దాన్ని పిల్లల కోసం వెచ్చిద్దామని, వారు వారి కలలు నెరవేర్చుకునేలా తీర్చిదిద్దుదామని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చారు. చిన్నారుల కోసం పిల్లలు సమయాన్ని వెచ్చించాలని అన్నారు. వారు చేసే చిన్నచిన్న పొరపాట్లను క్షమించి, వారిపై ప్రేమను కురిపిద్దామని చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, పౌష్ఠికాహారంపై ఖర్చు చేస్తే... వారు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. పిల్లలు ఆటలు ఆడుకునేలా సరైన వాతావరణాన్ని సృష్టించే బాధ్యతను అందరూ తీసుకోవాలని, అది సమాజంపై సానుకూల వాతావరణాన్ని చూపిస్తుందని అన్నారు. ఆటలు చిన్నారులను చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతాయని... వారిలో క్రీడా స్ఫూర్తి కూడా పెరుగుతుందని చెప్పారు.
Sachin Tendulkar

More Telugu News