Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ జరిమానాను నేనే చెల్లిస్తా: స్కూటర్ యజమాని

  • హెల్మెట్ లేకుండా స్కూటర్ పై వెళ్లిన ప్రియాంక
  • రూ. 6,300 జరిమానా విధించిన పోలీసులు
  • ప్రియాంక కోసం తన వాహనాన్ని ఇచ్చానన్న స్కూటర్ యజమాని

ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీకి ఉత్తరప్రదేశ్ లోని లక్నో పోలీసులు రూ. 6,300 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చలానాలను సదరు స్కూటర్ యజమానికి పోలీసులు పంపించారు. ఈ నేపథ్యంలో, ఆ జరిమానాను తానే చెల్లిస్తానని స్కూటర్ యజమాని రాజ్ దీప్ సింగ్ తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్ దీప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 28న తాను స్కూటర్ పై వెళ్తున్నప్పుడు ప్రియాంకా గాంధీతో పాటు మరో కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జార్ ను చూశానని చెప్పారు. తన స్కూటర్ కావాలని ధీరజ్ అడిగారని... ప్రియాంక కోసం తన వాహనాన్ని ఇవ్వకుండా ఉండలేకపోయానని తెలిపారు. చలానా విధించినట్టు డిసెంబర్ 29న మీడియా ద్వారా తాను తెలుసుకున్నానని చెప్పారు. ఈ మొత్తాన్ని తానే చెల్లిస్తానని... ప్రియాంక నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఈ మొత్తాన్ని తీసుకోనని అన్నారు.

More Telugu News