bhuvaneshwari: నేడు అమరావతి రైతులను పరామర్శించనున్న భువనేశ్వరి!

  • 15వ రోజుకు చేరిన రైతుల నిరసనలు
  • నేడు తుళ్లూరులో మహాధర్నా
  • రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపనున్న భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి, అక్కడ నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపనున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది.

నేటికి అమరావతి రైతుల పోరాటం 15వ రోజుకు చేరగా, తుళ్లూరులో మహాధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. వెలగపూడిలో 15వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగనుంది. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఐకాస నేతృత్వంలో ధర్నా జరుగనుంది. కాగా, నూతన సంవత్సరం వేడుకలను రద్దు చేసుకున్న చంద్రబాబు, నేడంతా అమరావతి రైతుల మధ్యే గడపాలని నిర్ణయించుకున్నారు.
bhuvaneshwari
Chandrababu
Amaravati
Farmers
Protest

More Telugu News