Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదం.. లిఫ్ట్ కూలి ఆరుగురి దుర్మరణం

  • ఇండోర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన
  • మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
  • లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై విచారణ

మధ్యప్రదేశ్‌లో విషాదం జరిగింది. ఓ బిల్డింగ్‌కు ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇండోర్‌లోని పాటల్‌పానీలో జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఇండోర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహూలోని ఓ ఫామ్ హౌస్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలిపారు.

మృతుల్లో వ్యాపారి పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పలక్ (27)తో ఆయన కుటుంబ సభ్యులు మరో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News