దక్షిణాదిలో హీరో కంటే హీరోయిన్‌ను తక్కువగా చూస్తారు: నేహా ధూపియా
- నిర్మాతలు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారు
- నేను చాలా ఆకలితో ఉన్నా..నిర్మాతలు పట్టించుకోలేదు
- ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది.. మరిచిపోలేకపోతున్నా
ఇంతకీ ఈ నటి ఎదుర్కొన్న సమస్య ఏంటంటే.. భోజనం సందర్భంలో తనను నిర్మాతలు పట్టించుకోకపోవడమే. హీరోకు భోజనం పెట్టి తనను మరిచారని పేర్కొంది. ``చాలా ఏళ్ల క్రితం నేను ఓ దక్షిణాది సినిమాలో నటించేటప్పుడు నిర్మాతలు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నా. అయినా కూడా నిర్మాతలు ముందుగా హీరోకే భోజనాన్ని అందించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అది నన్ను ఏమాత్రం బాధించలేదు. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది`` అని చెప్పింది నేహా ధూపియా. ఈమె తెలుగులో `నిన్నే ఇష్టపడ్డాను`, `విలన్`, `పరమవీరచక్ర` చిత్రాల్లో నటించారు. మరి ఈమె ఏ దక్షిణాది హీరోను టార్గెట్‌గా చేసిందన్న విషయం బహిర్గతం కాలేదు.