Telangana: 2020లో రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించాలి: సీఎం కేసీఆర్

  • రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం
  • వంద శాతం అక్షరాస్యతకోసం ప్రతిజ్ఞ చేయాలని పిలుపు
  • 'ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' నినాదంతో ముందుకు సాగాలి  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..  కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ నూతనోత్సాహం ఇవ్వాలని అభిలషించారు. 2020లో రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించాలని పేర్కొన్నారు. అక్షరాస్యతలో తెలంగాణ వెనకబడటం ఓ మచ్చ అని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

వంద శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు. 'ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' నినాదంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. అక్షరాస్యతపై గత పాలకులు అలక్ష్యం చూపారన్నారు. ఈ దుస్థితిని అధిగమించాలని సూచించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా త్వరలో కార్యాచరణ రూపొందించనున్నామని ఆయన వెల్లడించారు.

More Telugu News