cm: సీఎం జగన్ కు అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలిపిన ‘బెజవాడ బ్రదర్స్’

  • సచివాలయంలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన నేతలు
  • జగన్ ని కలిసి విషెస్ చెప్పిన మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు మల్లాది, జోగి రమేశ్
  • రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న వెల్లంపల్లి
ఏపీ సీఎం జగన్ కు ‘బెజవాడ బ్రదర్స్’ అడ్వాన్స్ గా న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో జగన్ ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్ కలిశారు.

ఈ సందర్భంగా కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, పుష్పగుచ్ఛం, పండ్ల బుట్ల అందజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు వెల్లంపల్లి ఓ ప్రకటనలో తెలిపారు.
cm
Jagan
Minister
Vellampalli
Malladi
jogi

More Telugu News