Amaravathi: ఇకపై ‘జై ఆంధ్ర.. జైజై ఆంధ్ర’ అని నినదించండి: రాజధాని రైతులకు పవన్ కల్యాణ్ పిలుపు

  • రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన పవన్
  • తుళ్లూరులో ‘జై ఆంధ్రప్రదేశ్’ నినదించిన రైతులు
  • ఇది కాదు ‘జై ఆంధ్ర’ అని నినదించండన్న పవన్
రాజధాని రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతూ తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పర్యటించిన విషయం తెలిసిందే. అమరావతి రైతులకు న్యాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ముందుకెళితే ఊరుకోమని హెచ్చరించిన పవన్, రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చిన పవన్ తన ప్రసంగాన్ని ముగించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ‘జై ఆంధ్రప్రదేశ్..’ అంటూ నినదించారు. మళ్లీ, వెంటనే స్పందించిన పవన్, ఈ నినాదం చాలా చిన్నది అని, నాడు ఎంతో స్ఫూర్తితో చేసిన ఉద్యమం ‘జై ఆంధ్ర’ అని, ఇకపై  ‘జై ఆంధ్ర, జై జై ఆంధ్ర’ నినాదం కొనసాగించాలని పిలుపు నిచ్చారు.
Amaravathi
Farmers
Tulluru
Pawan Kalyan

More Telugu News