Paruchuri: సుమన్ చాలా మంచి మనిషి: పరుచూరి గోపాలకృష్ణ

  • సుమన్ తో మా తొలి సినిమా అదే 
  •  తోటి నటులను ఆయన ఎంకరేజ్ చేస్తాడు 
  • చిరునవ్వుతోనే సమాధానమిచ్చే గొప్ప మనిషి ఆయనన్న పరుచూరి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో హీరో సుమన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "చిత్రపరిశ్రమకి మేము 1978లో వచ్చాము. పదేళ్ల పాటు సుమన్ తో కలిసి పనిచేసే అవకాశం లభించలేదు. సుమన్ సినిమాలను ఓంకార్ ఎక్కువగా రాసేవారు. సుమన్ హీరోగా మేము రాసిన మొదటి సినిమా 'రక్తకన్నీరు'. ఓ కేసు నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన చేసిన తొలి సినిమా ఇదే.

ఆ సినిమాలో నేను కూడా ఒక వేషం వేశాను. నేను డామినేట్ చేస్తున్నానని ఆయన అనుకోలేదు. జెంటిల్ మేన్ అనే జాబితాలోకి కొంతమందిని తీసుకుంటే, అందులో మొదటి వరుసలో సుమన్ కనిపిస్తాడు. తోటి నటులను ఆయన ఎంకరేజ్ చేస్తాడు. రచయితలను నమ్మే వ్యక్తి ఆయన .. తనపై వచ్చిన విమర్శలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పే గొప్పమనిషి ఆయన" అని చెప్పుకొచ్చారు.
Paruchuri
Suman

More Telugu News