Somesh Kumar: తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ నియామకం.. ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం

  • కాసేపట్లో బాధ్యతలను స్వీకరించనున్న సోమేశ్ కుమార్
  • 2023 డిసెంబర్ వరకు సీఎస్ గా బాధ్యతలు
  • సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సోమేశ్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్ గా సోమేశ్ కుమార్ వ్యవహరించనున్నారు. కాసేపట్లో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు, సీఎస్ రేసులో ఉన్న ఎస్కే జోషిని ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా నియమించారు.
Somesh Kumar
Chief Secretary
KCR
TRS

More Telugu News