నాకు ఎవరూ కాఫీ ఇచ్చేవారు కాదు .. ఇవ్వొద్దని వెంకటేశ్ చెప్పారట: ఖుష్బూ

31-12-2019 Tue 15:02
  • నాకు కాఫీ అంటే చాలా ఇష్టం 
  •  రోజుకి 30 కప్పుల వరకూ తాగేదానిని
  • కాఫీ తగ్గించడానికి కారణం వెంకటేశ్ గారే
హిందీ .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ, 'కలియుగ పాండవులు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగు సమయంలో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి ఆమె ప్రస్తావించారు. 'కలియుగ పాండవులు' సినిమా చేస్తున్న సమయంలో నాకు కాఫీ పిచ్చి ఎక్కువ. ఒక రోజుకి 25 నుంచి 30 కప్పుల వరకూ కాఫీ తాగే దానిని.

అయితే ఆ సినిమా షూటింగు సమయంలో నేను ఎవరిని కాఫీ అడిగినా ఇవ్వడం లేదు .. 'వెంకటేశ్ గారు ఇవ్వొద్దని చెప్పారు' అంటున్నారు. వెంకటేశ్ గారు ప్రొడక్షన్ టీమ్ ను పిలిచి, ఖుష్బూ అడిగితే ఒక్క కప్పు కాఫీ కూడా ఇవ్వొద్దని చెప్పారట. దాంతో వాళ్లంతా నాకు కాఫీ ఇవ్వడం మానేశారు. కాఫీ ఎక్కువగా తాగితే హెల్త్ దెబ్బతింటుందని వెంకటేశ్ గారు అలా చేశారు. ఇప్పుడు నేను కాఫీ తాగడం చాలా వరకూ తగ్గించేశాను .. అందుకు కారణం వెంకటేశ్ గారే' అని చెప్పుకొచ్చారు.