Hyderabad: హైదరాబాద్ భాష్యం స్కూల్ వద్ద ఉద్రిక్తత... ఓయూ జేఏసీ ఆందోళన

  • ఉప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం
  • భాష్యం విద్యార్థి దుర్మరణం
  • మరణించిన విద్యార్థికి రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్
హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో భాష్యం స్కూల్ కు చెందిన ఓ విద్యార్థి దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. హబ్సిగూడలోని భాష్యం స్కూల్ లో చదువుతున్న అనంత్ కుమార్ ఉప్పల్ వద్ద జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. అనంత్ ప్రయాణిస్తున్న స్కూల్ ఆటోను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. అనంత్ మరణించగా, మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

 కాగా, అనంత్ మృతితో ఓయూ జేఏసీ విద్యార్థులు భాష్యం స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరణించిన విద్యార్థికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గాయాలపాలైన విద్యార్థులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాలని కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా స్కూల్ నడుపుతున్నారంటూ ఓయూ జేఏసీ మండిపడింది.
Hyderabad
Bhashyam
Uppal
School
Auto
Lorry
Road Accident

More Telugu News