IPL: ఈసారి వెలవెలపోనున్న ఐపీఎల్ ప్రారంభం!

  • మార్చి 29 నుంచి ఐపీఎల్ తాజా సీజన్
  • ప్రారంభ మ్యాచ్ లకు కీలక ఆటగాళ్ల డుమ్మా
  • అంతర్జాతీయ సిరీస్ లు జరుగుతుండడమే కారణం
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రికెట్ లీగ్ లు ఉన్నా ఐపీఎల్ కున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆటగాళ్లపై కాసుల వర్షం కురియడమే కాదు, క్రికెట్ ప్రేమికులకు కోరుకున్నంత మజా లభిస్తుంది. ఇటీవలే వేలం పూర్తి చేసుకున్న ఐపీఎల్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం అవుతుంది. అయితే, ఈసారి ఐపీఎల్ ఆరంభం వెలవెలపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడమే!

సరిగ్గా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి ఆ నాలుగు జట్లు అంతర్జాతీయ మ్యాచ్ లతో బిజీగా ఉంటాయి. మార్చి 31 తర్వాతే ఆ జట్ల ఆటగాళ్లు తమ ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కలుస్తారు. అందుకే కొన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఐపీఎల్ తాజా సీజన్ ను ఏప్రిల్ 1 నుంచి జరపాలని ఐపీఎల్ మేనేజ్ మెంట్ ను కోరుతున్నాయి.
IPL
IPL-13
Cricket
BCCI
Australia
India
England
Sri Lanka
New Zealand

More Telugu News