Undavalli Sridevi: ఆ విషయాన్ని నిరూపిస్తే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కాళ్లు మొక్కుతా: పంచుమర్తి అనురాధ

  • మీ ఎన్నికే వివాదాస్పదం
  • మీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి రైతుల పక్షాన నిలిచారు
  • గ్రామ సచివాలయాలకు మీ వాళ్లే నల్లరంగు పూశారు
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు పెయిడ్ ఆర్టిస్టులని రుజువు చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాళ్లు మొక్కుతానని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. శ్రీదేవి ఎన్నికే వివాదాస్పదమని... దళితులకు దక్కాల్సిన అవకాశాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో హైజాక్ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని... ఈ విషయం రాష్ట్రపతి వరకు వెళ్లిందని చెప్పారు. మీ గెలుపు కోసం కృషి చేసిన రాయపూడికి చెందిన హరేంద్రనాథ్ చౌదరి ఈరోజు రైతుల పక్షాన నిలిచారని... ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గ్రామ సచివాలయాలకు మీ పార్టీవారే నల్లరంగు పూశారని... వారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని అనురాధ ప్రశ్నించారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాగించే అనైతిక కార్యకలాపాలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. కరకట్ట భూ యజమానుల నుంచి, కాజ టోల్ గేట్ వద్ద ఓ రియలెస్టేట్ కంపెనీ నుంచి ఎంత వసూలు చేశారో బయటపెడతామని చెప్పారు.
Undavalli Sridevi
Panchumarthi Anuradha
YSRCP
Telugudesam
Alla Ramakrishna Reddy

More Telugu News