Andhra Pradesh: అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు: ఏపీ మంత్రి పేర్ని నాని

  • పండగ సమయంలో అధిక ఛార్జీలు వసూలు చేయొద్దు
  • ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవు
  • అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955 కు ఫిర్యాదు చేయాలి
ప్రధాన పండగల సమయంలో ప్రయాణికుల రద్దీని ‘క్యాష్’ చేసుకునే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండగ ముందు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే బస్సుల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ బస్సుల యాజమాన్యంపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రయాణికులు వాట్సప్ నంబరు 8309887955 కు సమాచారం పంపాలని సూచించారు.
Andhra Pradesh
Minister
Perni Nani
private Buses

More Telugu News