Botsa Satyanarayana: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: బొత్స

  • నిధులు ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది
  • దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారు
  • నిధులు లేకపోయినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం
నిధులు ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందని... అభివృద్ధి ఆలోచనే లేకుండా దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చే సరికి నిధులే లేకుండా పోయాయని... అయినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. ఉగాదికి ఇళ్లు లేనివారికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. నిపుణుల కమిటీ సలహాలతో ఈ విషయంలో ఇప్పటికే ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Botsa Satyanarayana
YSRCP
Telugudesam

More Telugu News