Dasoju Shravan: పీసీసీ చీఫ్ తో ఎలా మాట్లాడాలో పోలీస్ కమిషనర్ కు తెలియదా?: దాసోజు శ్రవణ్

  • కాంగ్రెస్ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
  • కాంగ్రెస్ కార్యకర్తలేమైనా తీవ్రవాదులా?
  • అంజనీ కుమార్ ఏపీ కేడర్ కు చెందిన అధికారి
పోలీసులను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలేమైనా తీవ్రవాదులా? అని అడిగారు. కుట్రపూరితంగానే ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో ఎలా మాట్లాడాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు తెలియదా? అని ప్రశ్నించారు. వాస్తవానికి అంజనీ కుమార్ ఏపీ కేడర్ కు చెందిన వ్యక్తి అని అన్నారు. తెలంగాణ కేడర్ వాళ్లకు ప్రభుత్వం మంచి పోస్టులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Dasoju Shravan
Congress
Anjani Kumar

More Telugu News