Prabhas: 'మత్తు వదలరా'పై స్పందించిన ప్రభాస్

  • కొత్త కుర్రాళ్లు చేసిన కొత్త ప్రయోగం 'మత్తు వదలరా'
  • తొలిరోజునే పాజిటివ్ టాక్ 
  • సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు

ఇటీవలి కాలంలో కంటెంట్ వుంటే చాలు యూత్ ఆ సినిమాకి ఫుల్ మార్కులు ఇచ్చేస్తున్నారు. అలా యూత్ ఫుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మత్తు వదలరా'. హీరోయిన్ ప్రస్తావన లేకుండా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.

ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో స్పందించారు. తాజాగా ప్రభాస్ కూడా 'మత్తు వదలరా' టీమ్ తో కలిసి ఈ సినిమా చూశాడు. ఈ సినిమా ఎలా వుంది? కొత్త దర్శకుడి టేకింగ్ ఎలా వుంది? సాంకేతిక నిపుణుల పనితీరు .. ఆయా పాత్రలలో నటీనటుల నటన ఎలా వుంది? మొదలైన అంశాలను గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఆ వీడియోను ఈ సినిమా టీమ్ రేపు వదలనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ .. ప్రభాస్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Loading...

More Telugu News