Sri Simha: 'మత్తు వదలరా' ఖర్చు కేవలం 2 కోట్లు మాత్రమేనట

  • శ్రీ సింహ హీరోగా రూపొందిన 'మత్తు వదలరా'
  • దర్శకుడిగా రితేశ్ రాణా 
  • 42 రోజుల్లో షూటింగు పూర్తి 

కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా ఇటీవల 'మత్తు వదలరా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా పరిచయమైన దర్శకుడు రితేశ్ రాణాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా తక్కువ బడ్జెట్లో .. తక్కువ పాత్రలతో దర్శకుడు మంచి అవుట్ పుట్ ను రాబట్టినట్టు చెప్పుకున్నారు.

ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాము ఖర్చు చేసిన మొత్తం 2 కోట్లు మాత్రమేనని చెప్పారు. నటీనటుల పారితోషికాన్ని మినహాయిస్తే, మేకింగ్ కోసం ఖర్చు చేసిన మొత్తం 1.3 కోట్లు మాత్రమేనని అన్నారు. ఎక్కడికక్కడ ఖర్చును తగ్గిస్తూ .. ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా దర్శకుడు చూసుకున్నాడనీ, 42 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశాడంటూ వాళ్లు ఆయనను అభినందించారు.

  • Loading...

More Telugu News