Amit Shah: అమిత్ షా ఇంటి నుంచి మాట్లాడుతున్నామంటూ మంత్రికి ఫోన్.. రూ.3 కోట్లు డిమాండ్!

  • పార్టీకి విరాళం ఇవ్వాలంటూ పదేపదే ఫోన్ కాల్
  • అనుమానించిన మంత్రి కార్యాలయం
  • ఆట కట్టించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు

కేంద్రమంత్రి అమిత్ షా ఇంటి నుంచి తాము మాట్లాడుతున్నామని, మూడు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వాలంటూ సాక్షాత్తూ హరియాణా మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలకు ఫోన్‌ చేసి డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణా విద్యుత్ శాఖ మంత్రి అయిన రంజిత్‌సింగ్‌కు ఈ నెల 20 ఓ వ్యక్తి పదేపదే ఫోన్ చేశాడు.

ఈ ఫోన్‌కాల్‌ను అనుమానించిన మంత్రి కార్యాలయం వెంటనే అమిత్ షా ప్రత్యేక అధికారిని సంప్రదించింది. విరాళం కోసం తాము ఎవరికీ ఫోన్ చేయలేదని అటునుంచి సమాధానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, హరియాణా భవన్‌కు వచ్చి డబ్బులు తీసుకెళ్లాలంటూ నిందితుడికి సూచించారు. నమ్మి వచ్చిన నిందితుడు, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హరియాణకే చెందిన తోలు జాకెట్ల వ్యాపారి జగ్తార్ సింగ్‌గా, అతడికి సహకరించిన వ్యక్తిని ఉపకార్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

More Telugu News