America: అమెరికాలో విందులో పాల్గొన్న వారిపై కత్తితో దాడి

  • న్యూయార్క్‌లో ఘటన
  • విందు జరుగుతున్న ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన ఆగంతుకుడు
  • ఐదుగురికి గాయాలు
అమెరికాలోని ఓ ఇంటిలో జరుగుతున్న విందుపై కత్తి దాడి జరిగింది. యూదుపర్వదినం అయిన ‘హనుక్కా’ను పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఓ మతబోధకుడు (రబ్బీ) తన ఇంట్లో విందు నిర్వహించగా, కత్తితో చొరబడిన ఓ దుండగుడు విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విందులో పాల్గొన్న వారు భయంతో పరుగులు తీశారు. కత్తి దాడిలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం  అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  
America
newyork
knife attack

More Telugu News