Muncipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: మంత్రి మల్లారెడ్డి

  • అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు
  • తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారు
  • ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని దమ్మాయిగూడలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని, మున్సిపల్ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని చెప్పారు.
Muncipal Elections
TRS
Minister
Mallareddy

More Telugu News