Andhra Pradesh: ఏం అధ్యయనం చేసి ఆంగ్ల మీడియం నిర్ణయం తీసుకున్నారు?: జొన్నవిత్తుల

  • ఏపీలో ఇంగ్లీషు మీడియం
  • స్పందించిన జొన్నవిత్తుల
  • ప్రభుత్వానికే నష్టం అంటూ వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం తెలుగుకు బదులు ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆరోపించారు. ఇది చూసి తట్టుకోలేక ఎంతో ఆవేదనతో తెలుగు రచయితల మహాసభకు తరలివచ్చామని అన్నారు. ఏం అధ్యయనం చేసి ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మనది అద్భుతమైన భాషా కేంద్రం అని, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. ప్రభుత్వ చర్యలు తప్పు కాబట్టే రచయితలుగా, పౌరులుగా, గళం విప్పుతున్నామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం చాలా నష్టపోతుందని జొన్నవిత్తుల హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఇంగ్లీషు మీడియం అంశంలో పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు.

More Telugu News