Sunil: విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సునీల్

  • సందీప్ రాజ్ దర్శకత్వంలో కలర్ ఫొటో సినిమా
  • విలన్ గా చేస్తున్న సునీల్
  • ప్రధానపాత్రల్లో సుహాస్, సందీప్
కమెడియన్ గా ప్రస్థానం ఆరంభించి ఆపై హీరోగా మారిన నటుడు సునీల్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. సునీల్ ఇప్పుడు విలన్ గా మారాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న కలర్ ఫొటో చిత్రంలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, వాటిలో కామెడీ టచ్ ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం సునీల్ పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కలర్ ఫొటో చిత్రంలో సుహాస్, సందీప్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో నాని రిలీజ్ చేశారు.
Sunil
Tollywood
Colour Photo
Suhas
Sandeep

More Telugu News